బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Published Wed, Dec 6 2023 1:54 AM | Last Updated on Wed, Dec 6 2023 1:54 AM

- - Sakshi

బుధవారం శ్రీ 6 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2023

7

9న జాతీయ

మెగా లోక్‌ అదాలత్‌

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): ఈనెల 9న జిల్లాలోని అన్ని కోర్టులలో జరగనున్న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

13 మండలాలపై ప్రభావం

జిల్లాలోని 13 మండలాల పరిధిలో 177 గ్రామా ల్లో తుఫాన్‌ ప్రభావం కనిపించింది. 63,770 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. 485 హెక్టార్లలో వేరుశనగ, 1511 హెక్టార్లలో పొగాకు, 477 హెక్టార్లలో మొక్కజొన్న, 4,957 హెక్టార్లలో శనగ, 2947 హెక్టార్లలో మినుముతోపాటు, 889 హెక్టార్లలో మిగిలిన పలు రకాల పంటలు నీట మునిగి పనికి రాకుండా పోయాయి. మొత్తంగా 75,036 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మంగళవారం మధ్యాహ్నం వరకు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రాథమిక అంచనా మాత్రమే. రాబోవు రెండురోజుల్లో ఈ లెక్కలు మరింత పె రిగే అవకాశం ఉంది. తుఫాన్‌ తగ్గాక అధికారులు పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించనున్నా రు. మిర్చి పంట వర్షపు నీటిలో మునిగి దెబ్బతింది. చేతికి వచ్చిన పంటలు నీటిపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

సాక్షి ప్రతినిధి, బాపట్ల: మిచాంగ్‌ తుఫాన్‌ బాపట్ల జిల్లాను అతలాకుతలం చేసింది. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలోని సూర్యలంక వద్ద తీరం దాటింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తుఫాన్‌ తీరం దాటినా మధ్యాహ్నం 12 గంటల నుంచే బాపట్ల, సూర్యలంక, చీరాల వాడరేవు, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీశాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. చీరాల ప్రాంతంలో సముద్రం 60 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. బాపట్ల, నిజాంపట్నం ప్రాంతంలో 20 నుంచి 30 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. దీంతో తీరం మొత్తం కోతకు గురైంది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు నేలకూలాయి. పూరి గుడిసెలు నేల మట్టం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి నీరు చేరింది. సూర్యలంక తీరంలోని పోలీసు అవుట్‌పోస్టు దెబ్బతింది. బీచ్‌కు వచ్చేవారి కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక స్నానపు షెడ్లు కొట్టుకుపోయాయి. మంగళవారం రాత్రి వరకు ఈదురుగాలులు, వర్షం కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తుఫాన్‌ ప్రభావంతో రెండు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు

ఈదురుగాలులకు జిల్లా వ్యాప్తంగా వందలాది విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. కొన్ని ప్రాంతాల్లో పూరిళ్లు కూలిపోయాయి. సోమవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో వంకలు, వాగులకు నీరు చేరింది. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అద్దంకి ప్రాంతంలో గుండ్లకమ్మ, నల్లవాగులు పొంగి ప్రహించాయి. పర్చూరు నియోజకవర్గంలోని పోలూరు, వింజనంపాడు, యద్దనపూడి వాగులు నీటితో పొంగి పొర్లాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ప్రభుత్వ ఆదేశాలతో సహాయక చర్యలు

తుఫాన్‌ ప్రభావంతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎస్పీ వకుల్‌జిందాల్‌ బాపట్ల, చీరాల ప్రాంతాల్లోనే ఉండి జిల్లా, మండల స్థాయి అధికారులను బృందాలుగా విభజించి సహాయక చర్యలు పర్యవేక్షించారు. జిల్లా స్థాయి అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఉండి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూశారు. రెండు రోజుల ముందు నుంచే బాపట్ల, చీరాల, రేపల్లె ప్రాంతాల్లోని మూడువేల మందికి పైగా లోతట్టు ప్రాంతాల ప్రజలను తుఫాన్‌ పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలు సమకూర్చారు. వర్షం తీవ్రత పెరిగే పరిస్థితుల్లో మరింత మందికి షెల్టర్లలో వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. లోతట్టు ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. మంగళవారం మంత్రి మేరుగ నాగార్జున వేమూరు ప్రాంతంలో తుఫాన్‌కు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

నీట మునిగిన ఉద్యాన పంటలు

తుఫాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న పలు ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 15,220 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. తుఫాన్‌ ప్రభావంతో మిర్చి పంట ఐదు వేల హెక్టార్లకుపైగా నీట మునిగింది. కూరగాయల పంటలు ఐదువేల హెక్టార్లకుపైగా నీట మునిగాయి. 1444 హెక్టార్లలో అరటి సాగులో ఉండగా, ఈదురుగాలులకు చాలా వరకు నేలకొరిగాయి.

భారీ వర్షపాతం నమోదు

మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో మూడురోజులపాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నాటికి జిల్లాలో అత్యధికంగా కొరిశపాడు మండలంలో 24 సెం.మీ వర్షం కురిసింది. చీరాలలో 29 సెం.మీ, యద్దనపూడిలో 18 సెం.మీ, పిట్టలవానిపాలెంలో 18 సెం.మీ, కారంచేడు 17 సెం.మీ, కొల్లూరు 17 సెం.మీ, ఇంకొల్లులో 15 సెం.మీ, పర్చూరులో 14.5 సెం.మీ, వేమూరులో 14 సెం.మీ, అమర్తలూరులో 13 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. మిగిలిన 15 మండలాల్లో ఐదు నుంచి 12 సెం.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

నేడు విద్యాసంస్థలకు సెలవు

బాపట్లఅర్బన్‌: తుఫాన్‌ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో అంగన్‌వాడీ స్కూల్స్‌, పాఠశాలలకు కళాశాలలకు బుధవారం సెలవు దినంగా ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

న్యూస్‌రీల్‌

స్తంభించిన జనజీవనం

60 మీటర్ల మేర చొచ్చుకొచ్చిన సముద్రం

భారీగా ఈదురుగాలులు, వర్షం

వేలాది ఎకరాల్లో నేలవాలిన వరి

నీట మునిగిన మిర్చి, శనగ పంటలు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

లోతట్టు ప్రాంత ప్రజలు తుఫాన్‌ షెల్టర్లకు తరలింపు

నీట మునిగిన పంటను పరిశీలించిన మంత్రి మేరుగ నాగార్జున

సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న

కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎస్పీ వకుల్‌ జిందాల్‌

అంధకారంలో జిల్లా

తుఫాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని బాపట్ల, చీరాల, తెనాలి డివిజన్‌ల పరిధిలో వందలాది విద్యుత్‌ స్తంభాలు కిందపడ్డాయి. బాపట్ల డివిజన్‌లో 45, చీరాలలో 35, తెనాలి పరిధిలో 20 చొప్పున వందకు పైగా ఇన్సిలేటర్లు పాడైపోయాయి. చెట్లు, చెట్లకొమ్మలు విరిగి విద్యుత్‌ తీగలపై పడడంతో విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు వేగవంతం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో నీటిలో నానుతున్న వరి పనలు1
1/6

భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో నీటిలో నానుతున్న వరి పనలు

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement