వారంలో ఈ రాశివారు శుభవార్తలు వింటారు | Weekly Horoscope In Telugu 18th July To 24th July 2021 | Sakshi
Sakshi News home page

వారంలో ఈ రాశివారు శుభవార్తలు వింటారు

Jul 18 2021 6:16 AM | Updated on Jul 18 2021 6:16 AM

Weekly Horoscope In Telugu 18th July To 24th July 2021 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆశ్చర్యకరమైన రీతిలో పనులు చక్కదిద్దుతారు. మీ వ్యూహాలు, ఆలోచనలు కలసివస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు తోడుగా నిలుస్తారు. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలించి అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు హెచ్చుతగ్గులు ఉన్నా మొత్తానికి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహి ణి, మృగశిర 1,2 పా.)
వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలమైనరీతిలో మలచుకుంటారు. మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడి ఊరట లభిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొన్ని సమస్యలను ఎదుర్కొంటూనే చాకచక్యంగా వ్యవహరిస్తారు. శుభకార్యాల నిర్వహణపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మునుపటి కంటే అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలు వివాదాల నుంచి బయటపడతారు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మొదట్లో కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. అయినా మొక్కవోని దీక్షతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన పిలుపు సంతోషం కలిగిస్తుంది. కొత్త వస్తువులు, వస్త్రాలు కొంటారు. శుభకార్యాలపై బంధువులతో చర్చలు సాగిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో తగాదాలు. తెలుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక విషయాలలో కొంత అనుకూలత ఉంటుంది. కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుని ఊరట చెందుతారు. అనుకున్న పనులను సాఫీగా పూర్తి చేయడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు రావచ్చు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. కొంత శ్రమపడ్డా విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. వివాహాది వేడుకల నిర్వహణపై తుది నిర్ణయానికి వస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఇంతకాలం ఎదురుచూసిన మార్పులు జరిగే సూచనలు. రాజకీయవర్గాలకు పదవులపై కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలలో గందరగోళం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం తరచూ కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో లేనిపోని విభేదాలు నెలకొని మనశ్శాంతి లోపిస్తుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. కొత్త పరిచయస్తుల విషయంలో అప్రమత్తంగా మెలగండి. వ్యాపారాలు విస్తరించేందుకు మరింత శ్రమ పడతారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కళారంగం వారికి నిరుత్సాహమే. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త వ్యూహాలను అమలు చేసి సత్తా చాటుకుంటారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఊరట చెందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాల దిశగా నడుస్తారు. ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు. రాజకీయవర్గాల యత్నాలలో కొంత కదలికలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
గతానుభవాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్య ఒకటి పరిష్కారదిశగా సాగుతుంది. భూములకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటర్వ్యూలు అంది నిరుద్యోగులు ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో పలుకుబడి పెంచుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో భాగస్వాములు సహకారం అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడులు, గందరగోళం తొలగుతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు మరింత చేరువ కాగలవు. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరే సమయం. ఆప్తుల నుంచి పిలుపు అందుతుంది. అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి. ఆస్తుల విషయంలో గందరగోళం తొలగి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు మునుపటి కంటే మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
నూతనోత్సాహంతో ముందుకుసాగి అనుకున్న విజయాలు సొంతం చేసుకుంటారు. ఇంతకాలం పడిన ఇబ్బందులు అధిగమిస్తారు. చేపట్టిన వ్యవహారాలు మరింత వేగంగా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు మరింతగా గుర్తుకు తెచ్చుకుంటారు. చాకచక్యం, నేర్పుగా భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థాయి వారి సహాయసహకారాలు అందుతాయి. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ప్రారంభంలో నెలకొన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు మరింత సంతృప్తినిస్తాయి. రావలసిన సొమ్ము సైతం అందుతుంది.  సంఘంలో గౌరవప్రతిష్ఠలు మరింత పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవచ్చు. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి మరింత సహాయం అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మధ్యలో కొన్ని వివాదాలు ఏర్పడినా క్రమేపీ అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తిపై ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. వ్యాపారాలు ఆశించినంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫమవుతాయి. వారం ప్రారంభంలో మిత్రులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement