ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope In Telugu From 16-11-2025 To 22-11-2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Nov 16 2025 4:11 AM | Updated on Nov 16 2025 4:11 AM

Weekly Horoscope In Telugu From 16-11-2025 To 22-11-2025

మేషం...
ఉత్సాహంగా అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారులకు మరింత అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు కృషి ఫలిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో  శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. పసుపు, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం...
చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. బంధువులు లేదా స్నేహితుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తుంది. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులు, పరిశోధకులకు అనుకూల సమాచారం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు. సూర్యారాధన చేయండి.

మిథునం....
రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్య కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని వేడుకలకు ఎట్టకేలకు హాజరవుతారు. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్తగా సంస్థలు ప్రారంభించే వీలుంది.  ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు లభిస్తాయి. రాజకీయవేత్తల యత్నాలు సఫమవుతాయి. కళాకారులు, క్రీడాకారులకు కొన్ని అవకాశాలు దక్కుతాయి.  వారం మధ్యలో ఆస్తి వివాదాలు. శారీరక రుగ్మతలు. గులాబీ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం...
వీరికి అన్ని విధాలా అనుకూల సమయమే. అప్రయత్నకార్యసిద్ధి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహయోగం కలిగే  సూచనలు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. నిరుద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. ఆదాయం కొంత మెరుగుపడి అవసరాలు తీరతాయి.  బంధువులతో సఖ్యత నెలకొంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు మరిన్ని ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.

సింహం...
అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. తొందరపాటు మాటలతో బంధువులతో వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. . వ్యాపారులకు స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు  ఊహించని మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలకు చికాకులు తప్పకపోవచ్చు. కళాకారులు, క్రీడాకారులకు  అవకాశాలు చేజారతాయి. వారం మధ్యలో ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి.. ఎరుపు, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య...
కొన్ని సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. బంధువులు, స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ముఖ్య సందేశం. వాహనయోగం. వ్యాపారులు అవరోధాలు అధిగమిస్తారు. పెట్టుబడులకు మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం. వారం చివరిలో వృ«థా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

తుల....
అనుకున్న కార్యాలు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలులో వెనుకడుగు వేస్తారు. రాబడి కొంత ఆశాజనకమే. రుణభారాలు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులు మీకు అండగా నిలుస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సఫలం. కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం. దైవకార్యాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు మరిన్ని మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. గులాబీ, తెలుపు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. ఆత్మీయులు మరింత సహకరిస్తారు. సమాజంలో  విశేష గౌరవం పొందుతారు. ఏ కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు.  సోదరుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధులలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు. క్రీడాకారులు, పరిశోధకులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు...
రాబడి మరింత ఆశాజకనంగా ఉంటుంది. అనుకున్న కార్యాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటì  స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. దైవకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఒక పాత సంఘటన గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు సహకరిస్తారు. ఉద్యోగులు బాధ్యతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తారు. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు దక్కుతాయి. పరిశోధకులు, క్రీడాకారుల ఆశలు ఫలించే సమయం.  వారం చివరిలో అనారోగ్యం. స్నేహితులతో తగాదాలు. గులాబీ, నేరేడు రంగులు, శ్రీదుర్గాదేవి స్తోతాలు పఠించండి.

మకరం...
కార్యక్రమాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రియల్‌ ఎస్టేట్‌ల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. మీ కార్యదీక్షకు కుటుంబసభ్యులు సహకరిస్తారు. దైవకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారులకు మరింత లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు సంతోషం కలిగిస్తాయి. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధిస్తారు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. తెలుపు, నీలం రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం....
పట్టుదలతో కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఊహించని విధంగా ఆదాయం సమకూరుతుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. కొన్ని వేడుకలకు హాజరవుతారు. దైవారాధన కార్యక్రమాలు చేపడతారు.  కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు పెట్టుబడులు ఉత్సాహాన్నిస్తాయి, లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలకు శుభవర్తమానాలు. పరిశోధకులు, వైద్యుల సేవలకు గుర్తింపు లభిస్తుంది.   వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. శారీరక రుగ్మతలు. నలుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుధ్యానం చే యండి.

మీనం....
కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. కొంత కష్టించినా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మీ మనస్సుకు తోచిన విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులను కూడా అనూకూలంగా మలచుకుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని శుభవార్తలు. పరిశోధకులకు మంచి గుర్తింపు లభిస్తుంది.  వారం మధ్యలో  స్వల్ప అనారోగ్యం. చికాకులు. బంధువర్గంతో తగాదాలు.
గులాబీ, పసుపు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement