Weekly Horoscope: 8 మే నుంచి 14 మే 2022 వరకు

Weekly Horoscope In Telugu 08-05-2022 To 14-05-2022 - Sakshi

వార ఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు తీరతాయి. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. లేత గులాబీ, ఎరుపు రంగులు.  తూర్పుదిశ ప్రయాణాలు కలసివస్తాయి. శ్రీఉమాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ  పెరుగుతుంది. అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కొద్దిపాటి అనారోగ్యం సూచనలు. కుటుంబసభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. ఎరుపు, లేత గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీశివాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. అనుకోని ప్రయాణాలు ఎదురవుతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి, లాభాలను పొందడం కొంచెం కష్టమే. ఉద్యోగులకు పనిభారం, మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. వారం మధ్యలో విందువినోదాలు. వాహనయోగం. స్థిరాస్తివృద్ధి. నీలం, సిమెంట్‌ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీసుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం చేకూరుతుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి అవుతుంది. ఇంటాబయటా పరిస్థితులు అనుకూలం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు వి«ధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం.ఆకుపచ్చ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీమీనాక్షిస్తుతి పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణ. కోర్టు వ్యవహార ం ఒకటి అనుకూలంగా పరిష్కారం దొరుకుతుంది. సభలు, సమావేశాలలోపాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వివాదాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అనారోగ్యం. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు  అనుకూలం. శ్రీమహాలక్ష్మీ పంచరత్నావళి పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూలస్థితి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. లేత పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. పారిశ్రామికరంగం వారికి ఉన్నత హోదాల వారి నుండి ఆహ్వానాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం.  ఎరుపు, సిమెంట్‌ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుని ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళారంగం వారికి  çపురస్కారాలు రావచ్చు. వారం చివరిలో  అనారోగ్యం. పనులలో ఆటంకాలు.నీలం, నలుపు రంగులు.. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీశివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. పనులు కొన్ని సకాలంలో పూర్తి చేస్తారు.  ప్రయాణాలలో కొత్త పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠిస్తే మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకమైన సంఘటనలు ఎదురవుతాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. కళారంగం వారికి పదవీయోగాలు. వారం మధ్యలో మానసిక అశాంతి. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. నేరేడు, బిస్కెట్‌ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. పనులు మీ అంచనాల మేరకు పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు మరింత ఉత్సాహం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అనుకూలత. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం.  గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. చాకచక్యంగా ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానయోగం. వారం ప్రారంభంలో సోదరుల నుంచి ఒత్తిడులు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top