వారఫలాలు (8 నవంబర్‌ నుంచి 14 నవంబర్‌ 2020 వరకు)

Weekly Horoscope From November 8th To November 14th 2020 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతారు. ఊహించని సంఘటనలు కొన్ని మార్పులు తేవచ్చు. పరిస్థితులు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో మీకు మీరే సాటిగా నిరూపించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభ సూచనలు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. కృషి, పట్టుదలతో కార్యసాధకులుగా నిలుస్తారు. వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. అయితే, ఒక వ్యక్తి ద్వారా మాటపడాల్సిన పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఏ పని చేపట్టినా మందకొడిగా సాగుతుంది. బంధువులు, మిత్రుల నుంచి కొన్ని వివాదాలు ఎదురయ్యే సూచనలు. నిరుద్యోగులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉండి అప్పుల కోసం యత్నిస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కనిస్థితి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలు అంతంత మాత్రంగా కొనసాగి నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో సామాన్యస్థితి. కళారంగం వారు అవకాశాలు చేజార్చుకుంటారు. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. స్వల్ప ధనలబ్ధి. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని కార్యక్రమాలు శ్రమలేకుండానే పూర్తి చేస్తారు. ఆందరి ఆప్యాయత, అనురాగాలు పొందుతారు. యుక్తి, నేర్పుతో కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త పుంజుకుంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. ఒక సమాచారం మీలో కొంత మార్పు తేవచ్చు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు స్వాగతిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరించి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో పూర్వవైభవం కనిపిస్తుంది, సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. వారం చివరిలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పలుకుబడి, హోదాలు కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో కొనసాగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఒడ్డున పడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. నేరేడు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పలుకుబడి కలిగిన వారు పరిచయమై సహకరిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి చేకూరుతుంది. గృహ, వాహనయోగాలు కలుగుతాయి. మీ ఆలోచనలకు మరింత పదునుపెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  అనుకున్న పనులు పూర్తి చేయడంలో బంధువుల సాయం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరతాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు లభిస్తాయి. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కి ఊపిరిపీల్చుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అనుకున్న పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఎంతటి వ్యక్తినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖ వ్యక్తులు పరిచయమై ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో బంధువులతో విరోధాలు. అనారోగ్య సూచనలు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా మారతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల స్థితి. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని ఇబ్బందులు, సమస్యల నుంచి గట్టెక్కి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణబాధలు తొలగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. పొరపాట్లు సరిదిద్దుకుని కొత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగాలలో మార్పులు పొందుతారు. కళారంగం వారికి కార్యసిద్ధి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. శ్రమ పెరుగుతుంది. నీలం, పసుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల సహకారంతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తుల  వ్యవహారాలలో చిక్కులు వీడతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యూహాలతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. మిత్రులతో కలహాలు. ధనవ్యయం. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
-సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు   

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top