వారంలో ఈ రాశివారికి వాహనయోగం..

Weekly Horoscope From December 20th To December 26th 2020 - Sakshi

మేషం:
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. కుటుంబంలో  మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  ఉద్యోగులకు  ఒత్తిడులు తొలగి, అనుకోని హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రగతిదాయకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృషభం: 
కొన్ని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కే సూచనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.. రాజకీయవర్గాలకు కొన్ని  పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో మానసిక అశాంతి. ఇంట్లో ఒత్తిడులు. ఎరుపు, చాక్లెట్‌రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మిథునం: 
ముఖ్యమైన పనులలో కొంత జాప్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేస్తారు. సోదరులు, బంధువుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని  వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. చిరకాల ప్రత్యర్థులను మీ దారికి తెచ్చుకుంటారు.  వ్యాపారాలలో భాగస్వాముల సహాయం అందుతుంది. ఉద్యోగులకు  ఉన్నత పోస్టులు రావచ్చు. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం.  గులాబీ, పసుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: 
కొన్ని వ్యవహారాలలో జాప్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగులకు పైస్థాయి నుంచి కీలక సమాచారం. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం.  చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.

సింహం:
ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. కళాకారులకు మరిన్ని అవకాశాలు రావచ్చు. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. నీలం, లేత పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చనలు చేయండి.

కన్య:
ఊహించని విధంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల కొనుగోలు యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన ప్రగతి కనిపిస్తుంది.. పారిశ్రామికవర్గాలకు కొత్త కంపెనీల ఏర్పాటులో విజయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఒత్తిడులు పెరుగుతాయి. ఎరుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

తుల:
ఆర్థిక ఇబ్బందుల కొంత బయటపడతారు. దీర్ఘకాలిక సమస్య  పరిష్కారమవుతుంది. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. సోదరులు, సోదరీలతో కష్టసుఖాలు పంచుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు విశేష గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో శ్రమాధిక్యం. కుటుంబంలో చికాకులు. చాక్లెట్, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం:
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటాబయటా అనుకూలస్థితి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. చిన్ననాటి  విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసమస్యలు. గోధుమ, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు:
కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. భూవివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతచాయి. కళాకారులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. తెలుపు, లేత ఎరుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మకరం
ముఖ్యమైన పనుల్లో  స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆస్తుల విషయంలో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు.  నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పనిభారం. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం చివరిలో కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. నలుపు, చాక్లెట్‌ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.

కుంభం:
ఆర్థిక పరిస్థితిలో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా  పూర్తి కాగలవు. బంధువులు, మిత్రులతో అత్యంత కీలక విషయాలు చర్చిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అనూహ్యంగా పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది, అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. అనుకోని ఖర్చులు. తెలుపు, కాఫీరంగులు, ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మీనం:
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. మీ అంచనాలు, ఊహలు నిజం కాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు వరంగా మారుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శత్రువులే మిత్రులుగా మారతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. మానసిక అశాంతి.  పసుపు, ఎరుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top