Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు

today rasi phalalu daily horoscope 17 11 2023  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.చవితి ఉ.11.31 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పూర్వాషాఢరా.2.31 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.12.40 నుండి 2.11 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.09 వరకు, తదుపరి ప.12.08 నుండి 12.53 వరకు, అమృతఘడియలు: రా.9.34 నుండి 11.22 వరకు, నాగులచవితి; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.09, సూర్యాస్తమయం: 5.21. 

మేషం... ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

వృషభం... మిత్రులతో విభేదాలు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసమస్యలు. వ్యయప్రయాసలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం... పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొత్త వ్యక్తుల పరిచయం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం.. చిన్ననాటి మిత్రుల కలయిక. భూములు, వాహనాలు కొంటారు. యత్నకార్యసిద్ధి. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

సింహం... కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య... కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ఇంటాబయటా చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల..... కార్యజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం.. ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనులు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మకరం.... కార్యక్రమాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

కుంభం... శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. 

మీనం... వ్యవహారాలలో పురోగతి. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజకనంగా ఉంటుంది. వస్తులాభాలు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top