Daily Horoscope: ఈ రాశివారి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి

Today Horoscope In Telugu 14-01-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం తిథి శు.ద్వాదశి రా.10.25 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం రోహిణి రా.8.54 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం ప.12.01 నుండి 1.48 వరకు తిరిగి రా.3.04 నుండి 4.53 వరకు, దుర్ముహూర్తం ఉ. 8.49 నుండి 9.33 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.14 వరకు, అమృతఘడియలు... సా.5.20 నుండి 7.05 వరకు, భోగి పండుగ, ఉత్తరాయణం ప్రారంభం.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం     :  5.40
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

రాశి ఫలాలు:

మేషం.. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలలో సమస్యలు.  ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం.. పనుల్లో పురోగతి. ఇంటాబయటా ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం.  వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మిధునం.. బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింతగా పెరుగుతుంది. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఇబ్బందులు., ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.

కర్కాటకం.. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో సఖ్యత.  వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.

సింహం.. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. సోదరుల కలయిక.

కన్య.. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. సన్నిహితులతో వివాదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు.  ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం.

వృశ్చికం.. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు విస్తరిస్తారు.  ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది.

ధనుస్సు.. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి  ధనలాభం. వాహనయోగం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

మకరం.. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.  ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కుంభం.. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. బంధువిరోధాలు.  వ్యాపారాలలో ఆటుపోట్లు., ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం.. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. విందువినోదాలు. వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో కొత్త ఆశలు..
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top