ఈ రాశి వారు విందు, వినోదాల్లో పాల్గొంటారు | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారు విందు, వినోదాల్లో పాల్గొంటారు

Published Sun, May 29 2022 6:46 AM

Today Horoscope 29-05-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ. చతుర్దశి ప.2.13 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం కృత్తిక పూర్తి (24గంటలు), వర్జ్యం సా.5.34 నుండి 7.17 వరకు, దుర్ముహూర్తం సా.4.41 నుండి  5.33 వరకు, అమృతఘడియలు... రా.3.54 నుండి 5.45 వరకు, కర్తరీత్యాగం. 

సూర్యోదయం        :  5.29
సూర్యాస్తమయం    :  6.25
రాహుకాలం :  సా.4.30 – 6.00 యమగండం :  ప.12.00 – 1.30 

మేషం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. సోదరులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో ఆదరణ. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

మిథునం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కళాకారులకు ఒత్తిడులు.

కర్కాటకం: మిత్రులు, బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవచింతన. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

సింహం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. విలువైన వస్తువులు భద్రం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. 

తుల: పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో వివాదాలు. నిర్ణయాలలో యుక్తితో మెలగడం మంచిది. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు..

వృశ్చికం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ధనుస్సు: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వాహనయోగం. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి.

మకరం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. వివాహాది వేడుకలకు హాజరవుతారు.

కుంభం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. ధనవ్యయం.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement