ఈ రాశివారు రుణయత్నాలు చేస్తారు.. కష్టపడ్డా ఫలితం ఉండదు

Today Horoscope 26-12-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి: శు.తదియ ఉ.9.32 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: శ్రవణం రా.10.05 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.1.49 నుండి 3.19 వరకు, తిరిగి తె.4.20 నుండి 5.56 వరకు, దుర్ముహూర్తం: ప.12.20 నుండి 1.04 వరకు, తదుపరి ప.2.34 నుండి 3.17 వరకు, అమృతఘడియలు: ప.12.22 నుండి 1.50 వరకు;

రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు;
సూర్యోదయం 6.31;
సూర్యాస్తమయం 5.28. 

మేషం: వ్యవహారాలలో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషులతో సఖ్యత. విందువినోదాలు. అరుదైన ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

వృషభం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో తొందరపాటు. ఆస్తుల వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం: పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. కష్టపడ్డా ఫలితం ఉండదు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం: పలుకుబడి పెరుగుతుంది. భూములు కొంటారు. సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

సింహం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. పరపతి పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: సమస్యలతో సతమతం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల: శ్రమ తప్పకపోవచ్చు. కొన్ని వివాదాలు ఇబ్బందిగా మారతాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: కుటుంబంలో సమస్యలు. పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top