Today's Horoscope: ఈ రాశివారికి ముఖ్య సమాచారం ఊరట కలిగిస్తుంది.

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి బ.చవితి ప.3.51 వరకు తదుపరి పంచమి, నక్షత్రం శతభిషం రా.6.57 వరకు, తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం రా.1.10 నుండి 2.43 వరకు దుర్ముహూర్తం సా.4.49 నుండి 5.42 వరకు అమృతఘడియలు... ప.12.03 నుండి 1.46 వరకు.
సూర్యోదయం : 5.37
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. చిరకాల సమస్య పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగల అవకాశం.
వృషభం: ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్యసమాచారం ఊరట కలిగిస్తుంది. కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు. కొత్త వ్యాపార ఆలోచనలుకార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
మిథునం: కుటుంబంలో కలహాలు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి. ఆరోగ్యపరమైన చికాకులు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడులు.
కర్కాటకం: కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. వ్యాపార లావాదేవీలలోఆటుపోట్లు. ఉద్యోగులకు నిరుత్సాహం.
సింహం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్షా్యలు సాధిస్తారు.
కన్య: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయమై సహకరిస్తారు. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం.
తుల: కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు.కుటుంబ సమస్యలు వేధిస్తాయి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు.
వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. ఇంటాబయటా సమస్యలు.బంధువులు,మిత్రులతో విభేదాలు. రావలసిన సొమ్ము సకాలంలో అందదు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.
ధనుస్సు: సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అందరిలోనూ గుర్తింపు రాగలదు. అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.
మకరం: ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యక్రమాలలో అవాంతరాలు.బంధువులు, మిత్రులతో కలహాలు. వాహనాలు, ఆరోగ్యం విషయాలలో శ్రద్ధ చూపండి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు.
కుంభం: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. వివాదాలు చికాకు పరుస్తాయి. సన్నిహితులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు.
మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు.సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి లభిస్తుంది.