Today Horoscope: ఈ రాశి వారికి ధనలబ్ధి.. కీలక నిర్ణయాలు | Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశి వారికి ధనలబ్ధి.. కీలక నిర్ణయాలు

Published Sun, Sep 11 2022 6:51 AM

Today Horoscope 11-09-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.పాడ్యమి ప.2.22 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.10.02 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం: రా.7.23 నుండి 8.56 వరకు దుర్ముహూర్తం: సా.4.25 నుండి 5.14 వరకు, అమృతఘడియలు: తె.4.47 నుండి 6.21 వరకు (తెల్లవారితే సోమవారం).

సూర్యోదయం        :  5.50
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు
 

మేషం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

వృషభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మిథునం: పనులలో అవాంతరాలు. ఆప్తుల నుండి ఒత్తిడులు. ఆర్థిక ఇబ్బందులు. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

సింహం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంచనాల మేరకు ఉంటాయి.

కన్య: ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

తుల: మిత్రుల నుండి విమర్శలు. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

వృశ్చికం: పనులు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరం: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: వ్యవహారాలలో విజయం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మీనం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలు మందగిస్తాయి.

Advertisement
Advertisement