Today's Horoscope: ఈ రాశివారికి ఆరోగ్యం మందగిస్తుంది.. విలువైన వస్తువులు చేజారతాయి

Today Horoscope 11-08-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.చతుర్దశి ఉ.9.57 వరకు, తదుపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.7.02 వరకు, తదుపరి శ్రవణం తె.5.31 వరకు(తెల్లవారితే శుక్రవారం), వర్జ్యం ఉ.10.44 నుండి  12.14 వరకు; దుర్ముహూర్తం ఉ.9.57 నుండి 10.48 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.54 వరకు, అమృతఘడియలు... రా.7.44 నుండి 9.14 వరకు.

సూర్యోదయం :    5.45
సూర్యాస్తమయం    :  6.26
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు
 

మేషం: పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. పట్టుదల పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

వృషభం: రుణయత్నాలు. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. పనుల్లో తొందరపాటు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దైవచింతన. 

మిథునం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం: సన్నిహితుల సాయం అందుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. 

సింహం: కొత్త పనులు చేపడతారు. బంధువులు, మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. 

కన్య: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. 

తుల: పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. విలువైన వస్తువులు చేజారతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 

వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యలు పరిష్కారం. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. చిత్రమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. 

మకరం: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 

కుంభం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు.  

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top