ఇవాళ్టి దినఫలం: ఈ రాశివారికి ఉద్యోగాల్లో పురోగతి.. మిగతా రాశుల వారికి ఎలా ఉండనుందంటే..

Today Horoscope 10 12 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శనివారం 
సూర్యోదయం 6.23; సూర్యాస్తమయం 5.22. 

తిథి:  బ.విదియ ఉ.11.24 వరకు, తదుపరి తదియ 
నక్షత్రం: ఆరుద్ర సా.4.14 వరకు, తదుపరి పునర్వసు, 
వర్జ్యం: తె.5.30 నుండి 7.14 వరకు (తెల్లవారితే ఆదివారం), 

దుర్ముహూర్తం: ఉ.6.24 నుండి 7.51 వరకు, 
అమృతఘడియలు: లేవు.; 
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు, 
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు; 

మేషం: ఇంటర్వ్యూలు అందుతాయి.కార్యజయం. శుభవర్తమానాలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగులకు అరుదైన గుర్తింపు.

వృషభం:  దూరప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. మనశ్శాంతి లోపిస్తుంది.వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది తప్పదు.

మిథునం:  నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలం. మీ సత్తా చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

కర్కాటకం:  ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దేవాలయదర్శనాలు.

సింహం: స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు సహాయపడతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది. 

కన్య: చేపట్టిన కార్యకమాలు సకాలంలో పూర్తి. అందరిలోనూ గౌరవం. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు.

తుల: కార్యక్రమాలలో అవరోధాలు. ఖర్చులు పెరుగుతాయి. కృషి అంతగా ఫలించదు. వివాదాలకు దూరంగా ఉండండి. దేవాలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దూరప్రయాణాలు. 

వృశ్చికం: పరిస్థితులు అనుకూలించవు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. విచిత్రమైన సంఘటనలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. మానసిక అశాంతి. 

ధనుస్సు: స్నేహితులతో వివాదాలు తీరతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

మకరం: అంచనాలు నిజమవుతాయి. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దేవాలయదర్శనాలు.

కుంభం: కార్యక్రమాలు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

 మీనం: ఆకస్మిక ప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు. కళాకారులు అందిన అవకాశాలు చేజార్చుకుంటారు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top