రాశి ఫలాలు: ఈ రాశివారికి ఆస్తిలాభం.. వ్యాపారాల్లోనూ అదృష్టమే!

Today Horoscope 09 01 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, సోమవారం
సూర్యోదయం:  6.37
సూర్యాస్తమయం:  5.37

 
తిథి: బ.విదియ ఉ.7.34 వరకు, తదుపరి తదియ..
నక్షత్రం: ఆశ్లేష పూర్తి (24గంటలు),

వర్జ్యం: రా.6.53 నుండి 8.39 వరకు,
దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.40 నుండి 3.23 వరకు,
అమృతఘడియలు: తె.5.32 నుండి ఉ.7.17 వరకు (తెల్లవారితే మంగళవారం).
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: కార్యక్రమాలలో ఆటంకాలు. వథాఖర్చులు. ఆస్తి వివాదాలు పరిష్కారం. ప్రత్యర్థులు పెరుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తివివాదాలు పరిష్కారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. 

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. మానసిక అశాంతి. కార్యక్రమాలలో అవాంతరాలు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. 

కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ గౌరవం. కీలకమైన నిర్ణయాలు. కార్యజయం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. 

సింహం: ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్నేహితులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య: నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళాకారులకు సన్మానయోగం. చర్చలు సఫలం. దేవాయల దర్శనాలు. 

తుల: దూరపుబంధువుల నుంచి ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. 

వృశ్చికం: అప్పులు చేయాల్సివస్తుంది. దూరప్రయాణాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్యసూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనుకోని ఖర్చులు. 

ధనుస్సు: అనుకోని ప్రయాణాలు. ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. కృషి ఫలించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మకరం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. 

కుంభం: కృషి ఫలిస్తుంది. ప్రముఖ వ్యక్తులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. 

మీనం: స్నేహితులు, కుటుంబసభ్యులతో విభేదాలు. ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top