ఈ రాశి వారికి పనులు త్వరగా పూర్తవుతాయి | Today Horoscope 06-05-2022 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి పనులు త్వరగా పూర్తవుతాయి

Published Fri, May 6 2022 6:22 AM | Last Updated on Sat, May 7 2022 6:22 AM

Today Horoscope 06-05-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.పంచమి ఉ.9.11 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం ఆరుద్ర ఉ.6.34 వరకు, తదుపరి పునర్వసు వర్జ్యం రా.7.51 నుండి 9.35 వరకు, దుర్ముహూర్తం ఉ.8.09 నుండి 8.57 వరకు, తదుపరి ప.12.20 నుండి 1.11 వరకు అమృతఘడియలు... లేవు. 

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం     :  6.16
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు
 

రాశి ఫలాలు.. 

మేషం: బాకీలు వసూలవుతాయి. ఆప్తులు, బంధువులతో వివాదాలు తీరతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలలో ఆటంకాలు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మిథునం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి..

సింహం: ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో పురోభివృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు.

తుల: కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

ధనుస్సు: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.

మకరం: ప్రముఖులు సహాయపడతారు. ఆర్థికంగా బలపడతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనయోగం. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విశేష రాణింపు.

కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మీనం: మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement