ఈ రాశివారికి శుభవార్తలు.. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి

Today Horoscope 05-10-2022 - Sakshi

శ్రీశుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.దశమి ఉ.11.15 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం: శ్రవణం రా.9.33 వరకు తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.1.17 నుండి 2.47 వరకు దుర్ముహూర్తం: ప.11.24 నుండి 12.13 వరకు అమృతఘడియలు: రా.1.18 నుండి 2.46 వరకు, విజయదశమి.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.45
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు
 

మేషం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: విచిత్ర సంఘటనలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం: సన్నిహితుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

సింహం: కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వాహనసౌఖ్యం. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కన్య: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి.

తుల: కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆస్తుల వివాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యవహారాలు ముందుకు సాగవు. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

మకరం: శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. సోదరులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. సోదరులతో మాటపట్టింపులు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top