ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి | Today Telugu Horoscope On March 23rd, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి

Mar 23 2025 12:16 AM | Updated on Mar 23 2025 10:36 AM

Rasi Phalalu: Daily Horoscope On 23-03-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు,ఫాల్గుణ మాసం, తిథి: బ.నవమి  రా.12.50 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పూర్వాషాఢ రా.12.02 వరకు, తదుపరి ఉత్తరాషాఢ,వర్జ్యం: ఉ.9.07 నుండి 10.44 వరకు, దుర్ముహూర్తం: ప.4.31 నుండి 5.18 వరకు, అమృత ఘడియలు: రా.7.01 నుండి 8.40 వరకు.

సూర్యోదయం :  6.06
సూర్యాస్తమయం :  6.07
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం... వ్యయప్రయాసలు. పనుల్లో నిదానంగా సాగుతాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

వృషభం... కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం.... కాంట్రాక్టులు లభిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం.  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. లక్ష్యాల సాధనలో ముందడుగు.

సింహం... వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తి  వ్యవహారాలలో చికాకులు.

కన్య... పనుల్లో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువుల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. బాకీలు అందుతాయి. కుటుంబసమస్యల పరిష్కారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సొగుతాయి.

వృశ్చికం... సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపార లావాదేవీలు నత్తనడనకన సాగుతాయి. ఉద్యోగయత్నాలలో స్వల్ప ఆటంకాలు.

ధనుస్సు... నూతనోత్సాహం. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహార విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

మకరం..... బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

కుంభం.... మిత్రుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం.... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు పురోగతిలో సాగుతాయి. వస్తులాభాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement