
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.పంచమి ప.1.13 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: మూల పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.1.39 నుండి 3.21 వరకు, తదుపరి తె.4.52 నుండి 6.33 వరకు (తెల్లవారితే శనివారం),దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.24 నుండి 1.14 వరకు, అమృత ఘడియలు: రా.11.03 నుండి 2.50 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.47, సూర్యాస్తమయం: 6.12.
మేషం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
వృషభం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.
మిథునం: పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.
కర్కాటకం: చిత్రవిచిత్ర సంఘటనలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
సింహం: మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య: మిత్రులే శత్రువుల్లా మారతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా కొనసాగుతాయి.
తుల: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనయోగం. కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.
వృశ్చికం: రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు.
ధనుస్సు: సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
మకరం: అనుకున్న వ్యవహారాలు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు.
కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులలో పురోగతి. బంధువుల ద్వారా ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మీనం: పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. శుభవార్తలు అందుతాయి. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.