ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పనుల్లో పురోగతి | Today Telugu Horoscope On July 7th, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పనుల్లో పురోగతి

Jul 7 2026 3:06 AM | Updated on Jul 7 2026 9:08 AM

Rasi Phalalu: Daily Horoscope On 07-07-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.సప్తమి ఉ.8.36 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ఉత్తరాభాద్ర ప.12.46 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: రా.12.31 నుండి 2.05 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.10 నుండి 9.02 వరకు, తదుపరి రా.10.58 నుండి 11.42 వరకు, అమృత ఘడియలు: ఉ.8.00 నుండి 9.34 వరకు.

సూర్యోదయం : 5.34
సూర్యాస్తమయం: 6.35
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం...  వ్యయప్రయాసలు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం...  దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మిథునం....  కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహం. దైవచింతన.

కర్కాటకం...  ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

సింహం...  కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

కన్య....  నూతనోత్సాహంతో పనులు పూర్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా అనుకూలత. విచిత్రమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల....  నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం....  శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో కొంత నిరాశ.

ధనుస్సు...  రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

మకరం....  మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం...  ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆ«ధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మీనం....  పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement