ఈ రాశి వారు సత్తా చాటుకుంటారు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు | Rasi Phalalu: Daily Horoscope On 05 Feb 2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు సత్తా చాటుకుంటారు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు

Feb 5 2025 12:03 AM | Updated on Feb 5 2025 8:28 AM

Rasi Phalalu: Daily Horoscope On 05 Feb 2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు మాఘ మాసం , తిథి: శు.అష్టమి రా.3.10 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: భరణి రా.11.19 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ఉ.9.55 నుండి 11.23 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.54 నుండి 12.42 వరకు, అమృతఘడియలు: సా.6.50 నుండి 8.20 వరకు

సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం :  5.53
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం... మీ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

వృషభం... కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబసభ్యలతో విభేదాలు. దైవచింతన. భూవివాదాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

మిథునం... కార్యజయం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి లాభం. వాహనయోగం.

కర్కాటకం... అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ముఖ్య నిర్ణయాలు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

సింహం.... కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. అనారోగ్యం.

కన్య.... వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుస్తారు. ప్రయత్నాలు మందగిస్తాయి. కార్యక్రమాలలో అవరోధాలు. ఆలయాలు సందర్శిస్తారు.

తుల..... వ్యవహారాలు విజయవంతంగా పూర్తి. అందరిలోనూ గుర్తింపు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం... యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు.

ధనుస్సు.... దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. విద్యార్థులకు ఒత్తిడులు.

మకరం... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. మానసిక అశాంతి. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు.

కుంభం.... వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శనం.

మీనం... ప్రయాణాలు వాయిదా. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement