Daily Horoscope: ఆస్తి వివాదాల పరిష్కారం.. శుభవార్తలు వింటారు! Horoscope Today: Rasi Phalalu On 18-06-2024 In Telugu. Sakshi
Sakshi News home page

Daily Horoscope: ఆస్తి వివాదాల పరిష్కారం.. శుభవార్తలు వింటారు!

Published Tue, Jun 18 2024 6:50 AM | Last Updated on Tue, Jun 18 2024 8:51 AM

Horoscope Today: Rasi Phalalu On 18-06-2024 In Telugu

మేషం.. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

వృషభం.. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలబ్ధి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం.. వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

కర్కాటకం.. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు.  బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

సింహం.. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  భూ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కన్య.. మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల.. కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

వృశ్చికం.. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

ధనుస్సు.. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

మకరం.. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.

కుంభం.. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం.. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement