Today Horoscope In Telugu: ఈ రాశివారికి ఆప్తుల నుంచి కీలక సమాచారం

Horoscope Today: February 27, 2024 In Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.తదియ రా.11.21 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: హస్త తె.5.21 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి చిత్త, వర్జ్యం: ప.12.07 నుండి 1.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.44 నుండి 9.30 వరకు, తదుపరి రా.10.59 నుండి 11.46 వరకు, అమృతఘడియలు: రా.10.44 నుండి 12.30 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.24, సూర్యాస్తమయం: 6.01. 

మేషం: ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. బంధువుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృషభం: కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. రాబడికి మించి ఖర్చులు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

మిథునం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.

సింహం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. పనులు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు.

కన్య: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

తుల: పనుల్లో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. పోటీపరీక్షల్లో విజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

ధనుస్సు: ఇంటర్వ్యూలు రాగలవు. కొన్ని వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

మకరం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

కుంభం: రుణయత్నాలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్పదు. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: ప్రముఖుల నుంచి పిలుపు రావచ్చు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

whatsapp channel

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top