ఈ రాశి వారికి శుభ వార్తలు, మెరుగ్గా ఆర్థిక పరిస్థితి

Horoscope Today 28 03 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం,
తిథి: శు.సప్తమి రా.8.40 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: మృగశిర రా.7.11 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: తె.4.17 నుండి 6.02 వరకు (తెల్లవారితే బుధవారం),
దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.15 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.41 వరకు, అమృతఘడియలు: ఉ.9.48 నుండి 11.30 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు,
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు,

సూర్యోదయం: 6.02, సూర్యాస్తమయం: 6.07. 

మేషం: నూతన వ్యక్తులతో పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం పొందుతారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 

వృషభం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

మిథునం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి సహాయం. ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి. 

కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు. సోదరులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

సింహం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

కన్య: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

తుల: బంధువర్గంతో అనుకోని వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం: సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం.  కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. 

ధనుస్సు: బంధువులతో సఖ్యత. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. 

మకరం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ముఖ్య నిర్ణయాలు.

కుంభం: మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. పనులలో జాప్యం. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో చికాకులు.

మీనం: శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆత్మీయులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వృత్తి,వ్యాపారాలు సామాన్యం. ఆకస్మిక ప్రయాణాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top