Horoscope Today: March 17, 2023 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశివారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి

Mar 17 2023 6:57 AM | Updated on Mar 17 2023 9:15 AM

Horoscope Today 17-03-2023 - Sakshi

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.దశమి ఉ.10.59 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.12.13 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.9.19 నుండి 10.46 వరకు, తిరిగి తె.3.58 నుండి 5.27 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం: ఉ.8.33 నుండి 9.23 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.21 వరకు, అమృతఘడియలు: సా.6.14 నుండి 7.44 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.12, సూర్యాస్తమయం: 6.06. 

మేషం: కొత్త ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు. మీ ఊహలు నిజం కాగలవు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. 

వృషభం: బంధువిరోధాలు. మానసిక అశాంతి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. ఆదాయం తగ్గి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు అదనపు పనిభారం.వ్యాపారులకు లాభాలు కనిపించవు. 

మిథునం: కార్యక్రమాలలో జాప్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు.

కర్కాటకం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి.విలువైన వస్తువులు, స్థలాలు కొంటారు. సమస్యల నుంచి బయటపడతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు. 

కన్య: రుణదాతల ఒత్తిడులు, రాబడి నిరాశ కలిగిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యపరమైన చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి. శ్రేయోభిలాషులతో కలహాలు.  వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు బాధ్యతలు అధికం. 

తుల: రాబడి అంతగా కనిపించదు. వాహనాలు, స్థలాలు కొంటారు. యత్నకార్యసిద్ధి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగవర్గాలకు పనిభారం తగ్గుతుంది.

వృశ్చికం: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం.ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అంచనాలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగవర్గాలకు ఇంక్రిమెంట్లు. 

ధనుస్సు: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. చిత్రమైన సంçఘటనలు. విలువైన వస్తువులు జాగ్రత్త. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆస్తివివాదాలు నెలకొంటాయి. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు స్థానచలనం.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలిసివస్తాయి. గౌరవమర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు. 

కుంభం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. బంధువులు, కుటుంబసభ్యులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

మీనం: ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వస్తులాభాలు. పాతస్నేహితులను కలుసుకుంటారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు అనుకున్నది సాధిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement