ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం, వస్తులాభం

Horoscope Today 06-03-2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.చతుర్దశి సా.4.06 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: మఖ రా.12.02 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ఉ.10.48 నుండి 12.34 వరకు, దుర్ముహూర్తం: ప.12.33 నుండి 1.20 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.41 వరకు, అమృతఘడియలు: రా.9.23 నుండి 11.10 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.20, సూర్యాస్తమయం: 6.03. 

మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు ముమ్మరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి విమర్శలు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: రాబడికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మిథునం: కొన్ని వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సమాజసేవలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

కర్కాటకం: రుణయత్నాలు. బాధ్యతలు అధికమవుతాయి. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహావంతంగా ఉంటాయి.

కన్య: ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: రుణభారాలు తీరతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

ధనుస్సు: కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళం పరుస్తాయి. 

కుంభం: సన్నిహితుల నుండి ధనలాభం. సామాజిక కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల పిలుపు అందుతుంది. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మీనం: ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top