ఈ రాశివారికి శ్రమ పెరుగుతుంది

Daily Horoscope In Telugu 9 May 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.త్రయోదశి రా.7.41 వరకు, తదుపరి చతుర్దశి నక్షత్రం రేవతి సా.5.54 వరకు తదుపరి అశ్వని, వర్జ్యం... లేదు దుర్ముహూర్తం సా.4.34 నుండి 5.25 వరకు, అమృతఘడియలు... ప.3.17 నుండి 5.01 వరకు.

సూర్యోదయం        :  5.34
సూర్యాస్తమయం    :  6.17
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు:
మేషం: కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. కృషి ఫలించదు. కార్యక్రమాలలో జాప్యం. రావలసిన బాకీలు అందవు. ఆస్తి విషయాల్లో వివాదాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: నూతన పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. ఇంటర్వ్యూలు సంతోషం కలిగిస్తాయి. ఆకస్మిక వస్తులాభాలు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఉత్సాహం.

మిథునం: రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కర్కాటకం: వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో  విభేదాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు.

సింహం: కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులే సమస్యలు సృష్టి్టస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు,ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కన్య: ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. బంధువుల ద్వారా శుభవార్తలు. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కొన్ని బాకీలు అందుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో తగిన గుర్తింపు. దేవాలయ దర్శనాలు.

వృశ్చికం: బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. భూవివాదాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో పనిభారం. దైవదర్శనాలు.

ధనుస్సు: ఆదాయం తగ్గి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో కొంత నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో పనిభారం.

మకరం: ఆస్తి ఒప్పందాలు. వస్తులాభాలు. ఆదాయం పెరుగుతుంది. ధార్మిక చింతన.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహ, వాహనయోగాలు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. 

కుంభం: కుటుంబసభ్యులతో వైరం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఆందోళన. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం.

మీనం: విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top