ఈ రాశివారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు

Daily Horoscope In Telugu 30th July 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి బ.సప్తమి పూర్తి (24 గంటలు) నక్షత్రం రేవతి సా.4.15 వరకు, తదుపరి అశ్వని వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ఉ.8.14 నుండి 9.05 వరకు తదుపరి ప.12.32 నుండి 1.22 వరకు అమృతఘడియలు... ప.1.40 నుండి 3.24 వరకు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం     :  6.31
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

మేషం... కొత్తగా రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో æ సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. దైవదర్శనాలు.

వృషభం... కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

మిథునం... పనుల్లో విజయం. విద్యావకాశాలు పెరుగుతాయి.æ మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం... కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల నుంచి కొన్ని ఇబ్బందులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

సింహం... ప్రయాణాలు వాయిదా. మిత్రులతో విభేదాలు.  కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆర్థిక ఇబ్బందులు. విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కన్య... పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారాలలో కొంత లాభాలు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

తుల... వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

వృశ్చికం... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు... ఆర్థిక ఇబ్బందులు. రుణదాతల ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం... ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం... సోదరులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. పనులు ముందుకు సాగవు. మానసిక అశాంతి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. బంధువుల కలయిక. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలం. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top