గ్రహం అనుగ్రహం (28-10-2020) | Daily Horoscope In Telugu (28-10-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (28-10-2020)

Oct 28 2020 6:06 AM | Updated on Oct 28 2020 6:06 AM

Daily Horoscope In Telugu (28-10-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి శు.ద్వాదశి ప.1.18 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం పూర్వాభాద్ర ఉ.10.40 వరకు తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం రా.9.07 నుంచి 10.50 వరకు దుర్ముహూర్తం ప.11.20 నుంచి 12.06 వరకు అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    6.00
సూర్యాస్తమయం    :  5.28
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఆర్థిక ప్రగతి. నూతన వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: కొన్ని పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి. 

కన్య: ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూల పరిస్థితి.

తుల: రుణబాధలు తొలగి ఊరట లభిస్తుంది. ప్రఖ్యాత వ్యక్తులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: పనులలో ఆటంకాలు. ప్రయాణాలలో జాప్యం. ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదిస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

ధనుస్సు: ఆర్థిక లావాదేవీల్లో ఆటుపోట్లు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. బంధువులను కలుసుకుంటారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

మకరం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థికాభివృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

కుంభం: కుటుంబంలో కొన్ని సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించ నిరాశ చెందుతారు.

మీనం: కొన్ని పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement