గ్రహం అనుగ్రహం (22-11-2020) 

Daily Horoscope In Telugu (22-11-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం తిథి శు.అష్టమి రా.2.01 వరకు తదుపరి నవమి, నక్షత్రం ధనిష్ఠ ప.3.14 వరకు, తదుపరి శతభిషం వర్జ్యం రా.10.45 నుంచి 12.26 వరకు దుర్ముహూర్తం సా.3.50 నుంచి 4.34 వరకు, అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం        :  6.12
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: వ్యూహాలు ఫలిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

వృషభం: అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు, వస్త్రలాభాలు. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మిథునం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆకస్మిక ప్రయాణాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం: శ్రమకు ఫలితం ఉండదు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

సింహం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కన్య: కష్టానికి ఫలితం దక్కుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

తుల: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. మిత్రులు, బంధువుల నుంచి కొన్ని సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వైరం. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

ధనుస్సు: శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సకాలంలో చక్కదిద్దుతారు. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణదాతల ఒత్తిడులు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కుంభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సందేశం. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మీనం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు. రుణాలు చేయాల్సిన పరిస్థితి. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top