గ్రహం అనుగ్రహం (19-08-2020)

Daily Horoscope in Telugu (19-08-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుశ్రావణ మాసం, తిథి అమావాస్య ఉ.8.21 వరకు, తదుపరి భాద్రపద శు.పాడ్యమి, నక్షత్రం మఖ తె.4.09 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి పుబ్బ, వర్జ్యం సా.4.34 నుంచి 6.05 వరకు, దుర్ముహూర్తం ప.11.36 నుంచి 12.28 వరకుఅమృతఘడియలు... రా.1.48 నుంచి 3.21 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.21
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

గ్రహఫలం...
మేషం...వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో  నిరుత్సాహం.

వృషభం...రాబడికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో మార్పులు.

మిథునం...కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం....శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలలో వివాదాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

సింహం...నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని బాకీలు వసూలు. వ్యాపారాలు, ఉధ్యోగాలలో అభివృద్ధి.

కన్య....కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో గందరగోళం. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల..మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో కొంత పురోగతి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సంతోషకరంగా ఉంటుంది.

వృశ్చికం....ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనసౌఖ్యం.  వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు.

ధనుస్సు...రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మకరం..వ్యవహారాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

కుంభం...కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉన్నతి.

మీనం....కార్యజయం. వాహనాలు కొంటారు. భూవివాదాల పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. కొత్త మిత్రుల పరిచయం. ధన లాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top