ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు | Daily Horoscope In Telugu 17th July 2021 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు

Jul 17 2021 6:20 AM | Updated on Jul 17 2021 6:20 AM

Daily Horoscope In Telugu 17th July 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి శు.అష్టమి రా.12.12 వరకు, తదుపరి నవమి నక్షత్రం చిత్త రా.12.03 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం ఉ.8.51 నుండి 10.22 వరకు, తిరిగి తె.5.17 నుండి 6.45 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం ఉ.5.38 నుండి 7.21 వరకు, అమృతఘడియలు... సా.5.55 నుండి 7.26 వరకు.

సూర్యోదయం :    5.37
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: పనులలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యం. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

కర్కాటకం: కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి పిలుపు. ఆర్థిక పరిస్థితి మరించ మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తుంది.

సింహం: రుణఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వాహనాలు కొంటారు.

కన్య: నూతన ఉద్యోగాలు. ముఖ్య నిర్ణయాలు. కార్యక్రమాలలో విజయం.  పాతమిత్రుల కలయిక. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

తుల: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. వ్యాపారాలు మందగిస్తాయి.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు.  ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: కుటుంబంలో సంతోషదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

మకరం: ప్రయాణాల్లో మార్పులు. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమ మరింత పెరుగుతుంది. దైవదర్శనాలు. ధనవ్యయం.

కుంభం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆలయాల సందర్శనం.మానసిక అశాంతి.

మీనం: విద్యార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement