గ్రహం అనుగ్రహం (12-09-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (12-09-2020)

Published Sat, Sep 12 2020 6:23 AM

Daily Horoscope In Telugu (12-09-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి బ.దశమి రా.11.18 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం ఆరుద్ర ప.12.54 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం రా.1.06 నుంచి 2.44 వరకు దుర్ముహూర్తం ఉ.5.51 నుంచి 7.26 వరకు అమృతఘడియలు...లేవు

సూర్యోదయం 5.50
సూర్యాస్తమయం 6.04
రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు


మేషం : ధనలబ్ధి. వివాదాల పరిష్కారంలో విజయం. శుభవార్తలు. మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

వృషభం : పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం : కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం : శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టిపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం : సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్యనిర్ణయాలు.ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కన్య : నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కాంట్రాక్టులు దక్కుతాయి. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల : చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం : కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. సోదరులతో విభేదాలు. మానసిక అశాంతి. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు : ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. స్థిరాస్తి వృద్ధి. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త కుదుటపడతాయి. దైవచింతన.

మకరం : కార్యజయం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలం.

కుంభం : పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనం : ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

Advertisement
Advertisement