గ్రహం అనుగ్రహం (09-09-2020)

Daily Horoscope In Telugu (09-09-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి బ.సప్తమి రా.9.30 వరకు తదుపరి అష్టమి  నక్షత్రం కృత్తిక ఉ.8.34 వరకు తదుపరి రోహిణి వర్జ్యం రా.1.51 నుంచి 3.33 వరకు దుర్ముహూర్తం ప.11.34 నుంచి 12.21 వరకు అమృతఘడియలు...ఉ.5.55 నుంచి 7.40 వరకు

సూర్యోదయం 5.50
సూర్యాస్తమయం. 6.06
రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

మేషం : కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం.

వృషభం : ప్రముఖుల నుంచి ముఖ్యసమాచారం. ధనలాభం. కార్యసిద్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి.  వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.. ఆలయాలు సందర్శిస్తారు.

మిథునం : ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం : చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. అందరిలోనూ గుర్తింపు. సేవాధృక్ఫథం పెరుగుతుంది. ధనలాభ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

సింహం : ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య : ఆప్తులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు సంభవం. విలువైన వస్తువులు భద్రం. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

తుల : కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు.

వృశ్చికం : చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు : సంఘంలో ఎనలేని గౌరవం. కీలక సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం : కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో గందరగోళం. దైవదర్శనాలు.

కుంభం : ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మీనం : ఉద్యోగయత్నాలు సాఫల్యం. సంఘంలో ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. ఆలయ దర్శనాలు.  వాహనయోగం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top