గ్రహం అనుగ్రహం (06-08-2020) | Daily Horoscope in Telugu (06-08-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (06-08-2020)

Aug 6 2020 6:04 AM | Updated on Aug 6 2020 6:04 AM

Daily Horoscope in Telugu (06-08-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి బ.తదియ రా.10.44 వరకు, తదుపరి చవితి, నక్షత్రం శతభిషం ఉ.11.00 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం సా.5.56 నుంచి 7.40 వరకు, దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.48 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.33 వరకు, అమృతఘడియలు... తె.4.21 నుంచి 6.04 వరకు (తెల్లవారితే శుక్రవారం).

సూర్యోదయం :    5.43
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

గ్రహఫలం
మేషం..పరి^è యాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల మార్పులు.

వృషభం...పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. నూతన ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వస్తులాభాలు.

మిథునం....పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం.

కర్కాటకం.....ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.

సింహం...కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు వింటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత సానుకూలం.

కన్య...పరిచయాలు పెరుగుతాయి. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆ«ధ్యాత్మిక చింతన. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వాహనయోగం.

తుల...పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు రద్దు. బంధువులతో విభేదాలు. కుటుంబ, ఆర్థిక సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవచింతన. విద్యార్థులకు ఒత్తిడులు.

వృశ్చికం....వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆలయ దర్శనాలు.

ధనుస్సు...కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వస్తు,వస్త్రలాభాలు. దైవదర్శనాలు. శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు.

మకరం.....రుణయత్నాలు సాగిస్తారు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. ముఖ్య నిర్ణయాలు.

కుంభం...పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మీనం....ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement