గ్రహం అనుగ్రహం (05-09-2020)

Daily Horoscope In Telugu (05-09-2020) - Sakshi

శ్రీ శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ.తదియ ప.2.10 వరకు తదుపరి చవితి, నక్షత్రం రేవతి రా.1.07 వరకు తదుపరి అశ్వని, వర్జ్యం ఉ.11.53 నుంచి 1.36 వరకు దుర్ముహూర్తం ఉ.5.48 నుంచి 7.26 వరకు అమృతఘడియలు...రా.10.27 నుంచి 12.18 వరకు

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.09
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

మేషం : ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం : ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు.

మిథునం : నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ప్రత్యేక గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కర్కాటకం : శ్రమ తప్పకపోవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

సింహం : బంధువులతో స్వల్ప వివాదాలు. శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

కన్య : పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలపై దృష్టి. మిత్రుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకర మార్పులు.

తుల : మిత్రులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. కాంట్ట్రాక్టులు దక్కుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం : శ్రమానంతరం పనులు పూర్తి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

ధనుస్సు : ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం : ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

కుంభం : కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారవచ్చు.

మీనం : శుభవర్తమానాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల కలయిక. వాహనయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top