ఈ రాశివారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం | Daily Horoscope Spet 08 2024 Telugu Rasi Phalalu Today | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం

Published Sun, Sep 8 2024 7:47 AM | Last Updated on Sun, Sep 8 2024 11:06 AM

Daily Horoscope Spet 08 2024 Telugu Rasi Phalalu Today

మేషం: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. ఆకస్మిక ధనలాభం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో  అంచనాలు నిజమవుతాయి.

వృషభం: అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబసమస్యలు. చర్చలలో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. దైవదర్శనాలు.

కర్కాటకం: బంధువుల నుంచి ఒత్తిళ్లు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

సింహం: ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కన్య: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పడ్డా పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

తుల: నూతనోత్సాహంతో పనులు పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బాకీలు వసూలవుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

ధనుస్సు: కొత్త విషయాలు తెలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మకరం: కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కుంభం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: కుటుంబసమస్యలు. వ్యవహారాలలో అవాంతరాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. విద్యార్థులకు కొద్దిపాటి ఇబ్బందులు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement