రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

Nov 25 2026 2:24 AM | Updated on Nov 25 2026 2:24 AM

మదనపల్లె సిటీ: హిందూపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్‌ 14 బాలి,బాలికల జట్లు ప్రతిభను కనబరిచారు. ఫైనల్స్‌లో ఉమ్మడి చిత్తూరు జిల్లా బాలికలు కాంస్య పతకం సాధించారు. బాలికల విభాగంలో నాల్గవ స్థానం దక్కించుకున్నారు. బాలికల విభాగంలో మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని పావని, సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని సమీరా అంజుమ్‌ ,ఆరోగ్యమాత పాఠశాల విద్యార్థిని హర్షిత జాతీయ స్థాయికి ఎంపికై నట్లు ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ రమేష్‌బాబు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులను డీఈఓ సుబ్రమణ్యం, హెచ్‌ఎంలు సుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌ పీడీలు జలజ, సుధాకర్‌, అన్సర్‌, దేవకమ్మ, నరేష్‌, ఉపాధ్యాయకులు అభినందించారు.

ఏకపక్షంగా

వ్యవహరిస్తున్న ఆర్‌ఓ

పీలేరు: పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ తిరస్కరణలో రిటర్నింగ్‌ అధికారి రామచంద్ర (ఆర్‌ఓ) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పీలేరు మండలం, దొడ్డిపల్లె పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థి సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతో ఆర్‌ఓ రామచంద్ర నామినేషన్‌ పత్రాలు తిరస్కరించారని వైఎస్సార్‌ సీపీ నాయకులు సతీష్‌రెడ్డి, బిడినారాయణరెడ్డి, నారే వెంకట్రమణరెడ్డి ఆరోపించారు. ఆర్‌ఓ తెలిపిన మేరకు డ్వాక్రా రుణాలు అని రాయగా పీలేరు ఆర్డీఓ అప్పీల్‌ చేసిన పత్రంలో సంతకాలు తేడా ఉన్నట్లు తెలిపారని గుర్తు చేశారు. పొంతనలేని సమాచారంతో తిరస్కరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తిరస్కరణ పత్రాలు కూడా సోమవారం సాయంత్రానికి అందజేయాల్సి ఉండగా, మంగళవారం 12గంటలకు అందజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్‌ తిరస్కరణ లో ఆర్‌ఓ చేతివాటం ప్రదర్శించారా అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆర్‌ఓ రామచంద్ర మాట్లాడుతూ ఆర్డీఓ కార్యాలయంలో రాత్రి 11గంటలకు పత్రం అందజేశారని, రాత్రి సమయంలో వర్షం కారణంగా అందజేయలేకపోయానని, తిరస్కరణలో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు.

అభివృద్ధి పనులు

వేగవంతం చేయాలి

– జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

మదనపల్లి (కురబలకోట): జిల్లాలో వ్యవసాయం, మౌళిక సదుపాయాలు, పారిశ్రామిక పెట్టుబడులు, సంక్షేమ రంగాల అభివృద్ధికి అధికార యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ క్రాప్‌ బుకింగ్‌ వేగవంతం చేయడంతో పాటు రెండు లక్షల హెక్టార్ల సాగుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. రబీ సీజన్‌లో ఉద్యాన పంటలు, సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించి 8 వేల హెక్టార్ల సాగు లక్ష్యాన్ని సాధించాలన్నారు. హంద్రీనీవా కాలువ పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సోలార్‌ రూప్‌ టాప్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా హాస్టళ్లలో మౌళిక వసతులు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయలు కల్పించాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లలో ఆర్వోప్లాంట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తల ఖాళీ పోస్టుల వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. పెండింగ్‌ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మ, సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, ఆర్డీఓ వెంకటేషు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement