ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం

Nov 25 2026 2:24 AM | Updated on Nov 25 2026 2:24 AM

సదుం : కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా పాకాల మండలం పుదిపట్ల బయలు పంచాయతీ తురకవారిపల్లెకు చెందిన లేగత్‌ అలియాస్‌ లియాఖత్‌(32) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. సొంత పనుల నిమిత్తం బైక్‌పై సోమలకు బయలు దేరాడు. మార్గంమధ్యలోని నాగిరెడ్డిచెరువు కట్ట మలుపు వద్ద ఎదురుగా వచ్చిన కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విష్ణునారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement