జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2026 జనవరి ఓటరు జాబితా మేరకు ఓటర్లను గుర్తించారు. గ్రామాల్లో సర్పంచు, వార్డు సభ్యులను ఎన్నుకునే విషయంలో మహిళా ఓటర్లు అత్యంత కీలకంగా మారనున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 16,139 మంది అధికంగా ఉన్నారు. ఈ సంఖ్యను చూస్తే మహిళలు ఏ స్థాయిలో కీలకమో అర్థమవుతోంది. జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఓటర్ల సంఖ్య 9,09,602. ఇందులో పురుషులు 4,46,691 మంది, మహిళలు 4,62,830 మంది, ఇతరులు 81 మంది ఉన్నారు. కేవిపల్లె మండలంలో మాత్రమే పురుష ఓటర్ల ఆధిక్యం ఉంది, ఇది మినహా 24 మండలాల్లో మహిళలదే పైచేయి.


