ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్యాయత్నం

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

మదనపల్లె టౌన్‌ : ప్రియురాలు మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం మదనపల్లెలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె పట్టణంలోని బీకేపల్లి కాలనీలో నివాసం ఉంటున్న బాద్‌షా (28) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తనను మోసం చేసి ఆ యువతి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటంతో తీవ్ర మనస్తాపం చెందాడు. స్థానిక ఇందిరానగర్‌ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు గమనించి బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ సమస్యలతో..

బి.కొత్తకోట (మదనపల్లె టౌన్‌) : బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటనపై బాధితుడి కుటుంబీకులు, జిల్లా ఆసుపత్రి అవుట్‌పోస్ట్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని బి.కొత్తకోట పట్టణం, బీసీ కాలనీలో నివాసం ఉంటున్న మోహనన్‌రెడ్డి కుమారుడు భువనేశ్వర్‌రెడ్డి (23) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన భువనేశ్వర్‌రెడ్డి ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement