తంబళ్లపల్లె : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, అక్రమ కేసులతో పలువురి నాయకులను జైలుకు పంపినా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో పట్టుదలగా కృషి చేసి వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేసి అండగా నిలవడమే మాకు కొండంత బలమని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. ఆదివారం దీపావళి సందర్భంగా తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట మండలాలల నుంచి విజయం సాధించిన ఎంపీటీసీలు, నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. తంబళ్లపల్లె మండలంలో కూటమి నాయకులు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి,ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సూచనలతో కన్నెమడుగు సీనియర్ నాయకులు బాబు బ్రదర్స్ రామకృష్ణారెడ్డి, రవిశంకర్‌రెడ్డిలు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులను సమన్వయపరిచి ముందుండి నామినేషన్లు వేసిన అభ్యర్థుల గెలుపునకు అహర్నిశలు కృషి చేయడంపై వారిని ఎమ్మెల్యే అభినందించారు. 11 ఎంపిటీసీ స్థానాలకు 10 స్థానాలు, జెడ్పీటీసీ సందప్ప విజయం సాధించడంపై అభినందించారు. మండలంలోని ఎద్దులవారిపల్లె ఎంపీటీసీ అభ్యర్థిగా నిలిచిన భూదేవి భర్త చలపతినాయుడును కూటమి ప్రభుత్వం అక్రమ కేసుతో జైలుకు పంపారు. అయినా ఆమెకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొండంత ఽధైర్యం కల్పించి ఇంటింటా ప్రచారం చేశారు. ఊహించని విధంగా మెజార్టీతో గెలిచారు. అందరి సహకారంతోనే ఈ విజయం సాద్యపడిందని వారికి ఎప్పుడు రుణపడి ఉంటానని ఎమ్మెల్యేకి తెలిపారు. ఎమ్మెల్యే ఆమెను అభినందించారు.
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి


