స్థానిక ఎన్నికలకు దూరంగా ఆరోగ్యవరం ప్రజలు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు దూరంగా ఆరోగ్యవరం ప్రజలు

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లా కేంద్రం, మదనపల్లె మండలంలోని శానిటోరియం (ఆరోగ్యవరం) ప్రజలు దాదాపు 100 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ సుమారు 1000 నుంచి 1500 కుటుంబాలు, 3000 నుంచి 4000 మంది ఓటర్లు నివసిస్తున్నారు. వీరు కేవలం ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

లోకల్‌ బాడీ ఎన్నికలు అంటే ఏమిటి?

గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికలను లోకల్‌ బాడీ ఎన్నికలు అంటారు. ఈ ఎన్నికల ద్వారా సర్పంచ్‌, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, చైర్మన్‌ ఎన్నికవుతారు. వీరే గ్రామ, పట్టణ అభివృద్ధికి నిధులు తెచ్చి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.

లోకల్‌ అథారిటీ అంటే ఏమిటి?

ఆరోగ్యవరం గతంలో టీబీ శానిటోరియం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పరిపాలన ప్రాంతం. ఇది నేటికీ లోకల్‌ అథారిటీ పరిధిలోనే కొనసాగుతోంది. అంటే ఇది పంచాయతీ కాదు, మున్సిపాలిటీ అస్సలు కాదు. దీనివల్ల ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగవు. సర్పంచ్‌, వార్డు మెంబర్లు ఉండరు. దీని పర్యవసానంగా ప్రభుత్వం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులు, స్వచ్ఛ భారత్‌ నిధులు అందడం లేదు. స్థానికంగా సమస్యలు చెప్పుకునే ప్రతినిధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, డ్రైనేజీ వ్యవస్థ లేదు, తాగునీటి కొరత ఉంది. తమ ప్రాంతాన్ని సమీప పంచాయతీలో లేదా మదనపల్లె మున్సిపాలిటీలో విలీనం చేసి ఓటు హక్కు కల్పించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

లోకల్‌ బాడీ ఎన్నికలు వీళ్లకు ఉండవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement