26వ వార్డుకు సంబంధించి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు పోలింగ్ బూత్‌ల్లో దొంగ ఓట్లు వేయించారు. కొంతమంది గ్యాంగ్ దొంగ ఓట్లు, చనిపోయిన ఓట్లు వేసుకునేందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళితే వాళ్ల వద్ద గుర్తింపు కార్డులు ఉన్నాయని లోపలికి పంపించారు. అరాచకం సృష్టించే విధంగా దొంగ ఓట్లు వేసుకున్నారు. మా వద్ద గుర్తింపు కార్డులు ఉన్నా కూడా పంపలేదు.
– షేక్ సుల్తాన్ బాష, వైఎస్ఆర్సీపీ 26వ వార్డు అభ్యర్థి
ఓటు వినియోగించుకునేందుకు వేసే స్వస్తిక్ గుర్తులో తేడాలు ఉన్నాయి. తమ వార్డుకు సంబంధించిన మూడు పోలింగ్ బూత్‌ల్లో ఒక్కోచోట ఒక్కో తేడా కనిపించింది. దొంగ ఓట్లకు వీటిని వినియోగించారు. ఓటింగ్ రోజు అక్రమాలు జరిగాయని మేము చెబుతున్నాం. కానీ అధికారులు పట్టించుకోలేదు. – శీలం రమేష్,
45వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి


