మదనపల్లె సిటీ : ఆర్థికంగా వెనుబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పథకాన్ని అమలు చేస్తోంది. ఆన్‌లైన్‌లో గడువు ఈనెల 6వతేదీ వరకు పొడిగించారు. గడువు ముగిసినప్పటికి మరింత మంది పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో గడువు పెంచారు. పరీక్ష ఈనెల 29న నిర్వహించనున్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు నాలుగేళ్ల పాటు ఏటా రూ.12వేలు ఉపకార వేతనం అందుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో 1700 మంది విద్యార్తులు దరఖాస్తు చేసుకున్నారు.
అర్హతలు ఇలా..
ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, ఎయిడెడ్, ఆదర్శ, మున్సిపాలిటీ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ ఉండాలి. ఏడో తరగతిలో ఓసీ,బీసీ విద్యార్థులు 55 శాతం, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కుల ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.3.50 లక్షల లోగా ఉండాలి. ఇందుకు తహశీల్దార్ జారీ చేసే ఆధాయ ఽధ్రువీకరణ పత్రం, ఎస్సీ,ఎస్టీ,బీసీల కులఽ ధ్రువీకరణ పత్రం కూడా జతచేయాలి. పరీక్ష రుసుం ఓసీ,బీసీలకు రూ.వంద, ఎస్సీ,ఎస్టీలకు రూ.50 చెల్లించాలి. పరీక్ష ఏడో తరగతిలో పాట 8వ తరగతిలో అక్టోబర్ వరకు బోధించే సిలబస్ ఆధారంగా ఉంటుంది.
ఎన్‌ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షకు
గడువు పొడిగింపు


