రాయచోటి టౌన్ : పట్టణ పరిధిలోని వరిగ రోడ్డు శివార్లలో ముళ్లపొదల్లో సుమారు 45–50 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో అర్బన్ సీఐ బి.వి.చలపతి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఎర్రగళ్ల చొక్కా ధరించి ఉన్నాడని, ఆనవాళ్ల ఆధారంగా ఎవరైనా గుర్తిస్తే రాయచోటి అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్: యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలంలోని బెంగళూరు ప్రధాన రహదారిలోని చిప్పిలి వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రాగిమాకుల పల్లెకు చెందిన మనోహర్ బైక్‌పై ఇంటికి వెళ్తూ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్‌న్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని మదనపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.
పొలతలలో హుండీ ఆదాయం లెక్కింపు
పెండ్లిమర్రి : మండల పరిధిలోని ప్రముఖ శైవక్షేత్రమైన పొలతల శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవదాయ శాఖ సూపరింటెండెంట్ రమణమ్మ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది.ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర స్వామి, పార్వతీ దేవి, అక్కదేవతలు, పులి బండన్న స్వామి వార్ల శాశ్వత హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా, మొత్తం రూ. 15,65,909 నగదు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నగదుతో పాటు 1,800 గ్రాముల వెండి, 24 గ్రాముల బంగారం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజారెడ్డి, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


