వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్–14 బాలుర మల్టీడే అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ పోటీలు పోటాపోటీగా జరుగుతున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లలో బ్యాట్స్మెన్లు చెలరేగి ఆడటంతో భారీ స్కోర్లు నమోదయ్యాయి.
కర్నూలుపై నెల్లూరు హవా
గ్రౌండ్ 1 : క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కర్నూలుతో తలపడిన నెల్లూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 403 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెల్లూరు బ్యాట్స్మెన్లలో కిషల్ (99 పరుగులు) కేవలం 54 బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సమీర్ (82), మహిధర్ (89) బాధ్యతాయుతంగా ఆడి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
చిత్తూరుపై కడప పంజా
గ్రౌండ్–2 : మైదానంలో చిత్తూరు, కడప జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కడప జట్టు బ్యాట్స్మెన్లు చిత్తూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. 90 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 416 పరుగులు చేశారు. కడప బ్యాటర్ భానువర్షిత్ రెడ్డి (173 బంతుల్లో 146) అద్భుత శతకంతో రాణించగా, విష్ణువర్ధన్ రెడ్డి (98) సెంచరీకి రెండు పరుగుల దూరంలో అవుటయ్యాడు. చిత్తూరు బౌలర్లలో అశ్రిత్‌రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా, పర్వీత్, లిఖిత్, ఇరగంరెడ్డి చెరో వికెట్ తీసుకున్నారు. కార్యక్రమంలో రవిచలం, విష్ణువర్ధన్ రెడ్డి, జగదీష్, భరత్, సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


