అందరూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పాల్గొని ఓట్లు వేయాలని ఉత్సాహంగా ఎదురుచూస్తుంటే.. బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై గురువారం జరిగే ఓటింగ్‌కు ఎన్నికల కళ లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇక్కడి ఓటర్లకు లేకపోవడంతో వారంతా ఓటింగ్‌కు దూరంగా ఉండి ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. దీనికి కారణం హర్సిలీహిల్స్ టౌన్‌షిప్ కావడమే. 1999 వరకు హార్సిలీహిల్స్ కోటావూరు గ్రామపంచాయతీ, బి.కొత్తకోట మండల ప్రజా పరిషత్ పరిధిలో ఉండేది. 2000 ఏడాదిలో హార్సిలీహిల్స్‌ను టౌన్‌షిప్ కమిటీ ఏర్పాటు కావడంతో అప్పటినుంచి దీన్ని పంచాయతీ, మండల పరిషత్ పరిధి నుంచి పూర్తిగా తొలగించారు. అప్పటినుంచి కొండపై ఉంటున్న వారికి పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు లేవు. దాంతో కొండపై ఎన్నికల హడావుడి కూడా కనిపించదు. అయితే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికకు ఓటు హక్కు ఉంటుంది. కొండపై ప్రస్తుతం 95 మంది ఓటర్లు ఉన్నారు. సర్ తర్వాత జాబితా మేరకు ఇక్కడ 75 మంది ఓటర్ల లెక్క తేలింది.
– సాక్షి, మదనపల్లె


