ఎన్నికల నిర్వహణపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణపై శిక్షణ

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

మదనపల్లె సిటీ: మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనర్లు, మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు 111 మంది మాస్టర్‌ ట్రైనర్లు, 26 మంది మైక్రో అబ్జర్వర్లు హాజరయ్యారు. కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలకులు బాలకృష్ణ ప్రారంభించారు. శిక్షణలో రిసోర్సుపర్సన్లు, మాస్టర్‌ ట్రైనర్లకు బ్యాలెట్‌ బాక్సుల నిర్వహణ విధానం, ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియమ,నింబధనలు, విధి విధానాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మాధవ కృష్ణారెడ్డి, డీఈఓ సుబ్రమణ్యం, డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మేయర్‌ బరిలో

18 మంది అభ్యర్థులు

కడపకార్పొరేషన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కడప నగరపాలక సంస్థ మేయర్‌ బరిలో 18 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 19 మంది నామినేషన్లు వేయగా, స్క్రూట్నీలో 18 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇందులో వైఎస్సార్‌సీపీకి సంబంధించిన నామినేషన్లు 3, టీడీపీ–4, కాంగ్రెస్‌–2, సీపీఐ–1, బీజేపీ–1, అన్న కాంగ్రెస్‌ పార్టీ–1, మహాజన రాజ్యం పార్టీ–1, జనతాదళ్‌(ఎస్‌)–1, ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఈ ఇత్తేదుల్‌ ముస్లిమీన్‌–1 ఉన్నాయి.

● డివిజన్‌ కార్పొరేటర్లకు సంబంధించి 147 నామినేషన్లు దాఖలు కాగా 57 తిరస్కరణకు గురయ్యాయి. 90 నామినేషన్లు అర్హత కలిగినవిగా ప్రకటించారు. ఇందులో బీజేపీ–5, టీడీపీ–74, వైఎస్సార్‌సీపీ–3, జనసేన–5, స్వతంత్రులు ముగ్గరు ఉన్నారు. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత ఎంతమంది బరిలో నిలుస్తారో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement