మదనపల్లె పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయుధ పూజ | - | Sakshi
Sakshi News home page

మదనపల్లె పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయుధ పూజ

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

మదనపల్లె టౌన్‌: మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం దసరా పర్వదినం సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆయుధాలు, పోలీసు వాహనాలకు స్వయంగా పూజలు చేశారు. సిబ్బందికి ఎలాంటి అపాయాలు కలగకుండా సురక్షితంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా పండుగ ప్రతీక అని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసు కుటుంబాలకు, మీడియా ప్రతినిధులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, సీఐలు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement